Jul 25,2023 22:09

విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : కేరళ ప్రభుత్వ తరహాలో రుణ విముక్తి చట్టాన్ని తీసుకుని రావాలని ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, జిల్లా ప్రధానకార్యదర్శి జేవీజ రమణ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం రైతుసంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ...ఉమ్మడిజిల్లాలో అకాలవర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అన్ని పంటలకు వాతావరణ బీమాను వర్తింపచేయాలని, ఇన్సూరెన్స్‌ పూర్తిస్థాయిలో చెల్లించాలని, రైతుల మోటార్లకు స్మార్ట్‌మీటనే చెల్లించాలని కోరారు. ప్రతి రెతుకు ఎకరాకు రూ.10వేలు సాగుసాయం అందజేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలపై ఈనెల 26న జరిగిన ఈ సందస్సును విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల అధ్యక్షుడు కొత్తపేట మారుతి, నాయకులు నాగరాజు, శ్రీరాములు, రేగాటిపల్లి రవి పాల్గొన్నారు.