మాట్లాడుతున్న కలెక్టర్
రుణాల మంజూరులో ప్రయివేటు బ్యాంకుల భాగస్వామం తప్పనిసరి
నెల్లూరు:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి బ్యాంక్ లింకేజీ రుణాల మంజూరులో ప్రైవేటు బ్యాంకులు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని కలెక్టర్ యం హరి నారాయణన్ సూచించారు.శనివారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం నిర్వహించారు. తోలుత గత సంవత్సరం జిల్లాలో సాధించిన బ్యాంకింగ్ ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్ ప్రదీప్ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు కషి చేయాలన్నారు. కౌలు రైతులకు, ఎస్సీ,ఎస్టీ, మహిళలకు విరివిగా రుణాలు మంజూరు చేసి వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడాలన్నారు. అదేవిధంగా జగనన్న తోడు, చేయూత, సున్నా వడ్డీ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు తోడ్పాటును అందించాలన్నారు. నెల్లూరు నగర పరిధిలోని వెంకటేశ్వరపురం టిడ్కో ఇళ్ల ఆవాస పరిధిలో బ్యాంకు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ స్థాండప్ ఇండియా పధకం ద్వారా పేద ప్రజలకు సహాయం అందించుటకు బ్యాంకులు ముందుకు రావాలన్నారు.తదుపరి 2023-24 జిల్లా వార్షిక ఋణ ప్రణాళిక ను జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో కెనరా బ్యాంక్ ఆర్‌ఎం నాగరాజు , నాబార్డు డి డి ఎం రవి సింగ్, డి ఆర్ డి ఎ, మెప్మా, ఎపియంఐపి పీడీలు సాంబశివా రెడ్డి, రవీంద్ర, శ్రీనివాసులు, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ జె డి లు నాగేశ్వర రావు, మహేశ్వరుడు, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, బ్యాంకర్లు పాల్గొన్నారు.










