Jun 23,2023 21:38

మాట్లాడుతున్న జిఎం రవివర్మ

 కడప : కెనరా బ్యాంకు అందిస్తున్న వివిధ రకాల అరుణ సౌకర్యాలను సద్వి నియోగం చేసు కోవాలని విజయవాడ కెనరా బ్యాంక్‌ సర్కిల్‌ ఆఫీస్‌ జనరల్‌ మేనేజర్‌ పి. రవి వర్మ సూచిం చారు. కెనరా బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం కడప వారి ఆధ్వర్యంలో శుక్రవారం రిటైల్‌, వ్యవసాయ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రుణాలకు సంబంధించిన విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామిక వ్యక్తులు, ఐఎఎల్‌ఎ, ఎపిఐఐసి, ఐఎల్‌ఐఎ కొప్పర్తి, ప్రముఖ వైద్య నిపుణులకు, వివిధ వ్యాపారవేత్తలు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైల్‌, వ్యవసాయ, పారిశ్రామిక వ్యాపారులకు సంబంధించి కెనరా బ్యాంకు అందిస్తున్న వివిధ రకాల రుణ కార్యక్రమాలను సమావేశానికి హాజరైన ప్రముఖులకు వివరించారు. కడప కెనరా బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ కె. మురళీ మోహన్‌ మాట్లాడుతూ కడప జిల్లాలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు కెనరా బ్యాంకు ఎప్పుడు రుణాలను అందించడంలో ముందుంటుందని తెలిపారు. సమావేశంలో వివిధ ఖాతాదారులకు ఎంఎస్‌ఎం ఈ రుణాలు, ఇళ్ల రుణాలు, విద్యా రుణాలు, వాహనా వ్యక్తిగత రుణాలకు సంబంధించిన మంజూరు పత్రాలను జనరల్‌ మేనేజర్‌ పి. రవివర్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సమావేశానికి ఏపీఐఐసీ చీఫ్‌ అడ్వైజర్‌, కెనరా బ్యాంక్‌ డివిజనల్‌ మేనేజర్‌ ఏ.వి. రాజశేఖర్‌, డిఎం లు ఎం. ఆయుబ్‌, ఎస్‌. రమేష్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.