Aug 05,2023 07:51

దీపికతో పాటు వైసిపి కౌన్సిలర్లును సన్మానిస్తున్న గ్రాస్తులు

        హిందూపురం : హిందూపూరం రూరల్‌ మండలం చలివెందుల గ్రామపంచాయతీ రాచపల్లి గ్రామంలో యువ నాయకులు మహేంద్రనాథ్‌ రెడ్డి, గ్రామస్తులు రాచపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ అభివద్ధికి నిధుల గురించి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దీపికా దష్టికి తీసుకెళ్లరు. వెంటనే ఆమె స్పందించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం మహేందర్‌ రెడ్డి, గ్రామస్తుల ఆహ్వానం మేరకు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్బంగా గ్రాస్తులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బాణాల శ్రీనివాసరెడ్డి, చిలమత్తూరు ఎంపిపి పురుషోత్తం రెడ్డి, కొల్లకుంట ఆనంద రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కొటిపి హనుమంత్‌ రెడ్డి, నక్కలపల్లి శ్రీరామ్‌ రెడ్డి, మోడల్‌ స్కూల్‌ విద్యా కమిటీ ఛైర్మన్‌ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి
ప్రభుత్వం ప్రజల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నియోజక వర్గ సమన్వయ కర్త, ఇన్‌ఛార్జ్‌ దీపిక తెలిపారు. శుక్రవారం రూరల్‌ మండలం కొటిపి పంచాయతీ కంచనపల్లి గ్రామంలో గడగపగడగపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా దీపిక ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. టిడిపి తరపున గెలచిన వార్డు మెంబర్‌ సౌభాగ్యమ్మతో పాటు మరి కొంత మంది వైసిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి కె.సరస్వతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కొటిపి హనుమంత్‌ రెడ్డి, బసిరెడ్డి, నక్కలపల్లి శ్రీరామ రెడ్డి, ఆదెప్ప, కౌన్సిలర్‌ మణి, షాజియా, మారుతి రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తేనే గుర్తింపు
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే జాతీయ, అంతార్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ దీపిక అన్నారు. పట్టణంలోని వివేకానంద మిలీనియం పాఠశాల విద్యార్థులు షేక్‌ సిఫా అంజుమ్‌, రక్షిత్‌లు నేషనల్‌ త్రో బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలలో ద్వితీయ స్థానం సాధించారు. వారిని పాఠశాలలో శుక్రవారం దీపిక అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ బైసాని రాంప్రసాద్‌, చిలమత్తూరు ఎంపిపి పురుషోత్తం రెడ్డి, స్థానిక కౌన్సిలర్‌ గిరి, రాష్ట్ర సహాయ కార్యదర్శి హనుమంత్‌ రెడ్డి, కొల్లకుంట ఆనందరెడ్డి, నక్కలపల్లి శ్రీరామ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.