ప్రజాశక్తి - ద్వారకా తిరుమల
ద్వారకాతిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో, భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రదేశాలలో రూ.కోటి 20 లక్షలతో ఆర్వో వాటర్ ప్లాంట్లు శనివారం ప్రారంభించారు. సెంట్రల్ పార్కింగ్, కేశఖండనశాల, ప్రసాదాల విక్రయ కేంద్రం, కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయం, అన్న ప్రసాద కేంద్రం, శివాలయం, 120 రూమ్స్‌లో దివిస్ లేబరేటరీ వారు సిఎస్‌ఆర్ నిధులతో ఏడు చోట్ల ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్లను దేవస్థానం ఇఒ వెండ్రా త్రినాధరావు, ఇఇడివి భాస్కర్, ట్రస్టు బోర్డ్ మెంబర్స్‌తో కలిసి ప్రాంభించారు. దివీస్ లేబోరేటరీ ప్రతినిధులు సిహెచ్ శ్రీనివాసరావు, నగేష్ పాల్గొన్నారు.










