Sep 20,2023 22:05

రూ.90 లక్షలతో మటన్‌ ఫిిష్‌ మార్కెట్‌ ఏర్పాటు: ఎమ్మెల్యే


రూ.90 లక్షలతో మటన్‌ ఫిిష్‌ మార్కెట్‌ ఏర్పాటు: ఎమ్మెల్యే
ప్రజాశక్తి - గూడూరు టౌన్‌ : రెండు కోట్ల రూపాయల నిధులతో ఆధునిక వసతులతో కూరగాయల మార్కెట్‌ నిర్మాణం పూర్తయిందని మరో 90 లక్షల రూపాయలతో మటన్‌, ఫిష్‌ మార్కెట్‌ ఏర్పాటు చేస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్‌ రావు పేర్కొన్నారు. గూడూరు పట్టణం లోని ఐసిఎస్‌ రోడ్డులో నిర్మాణం పూర్తయిన కూరగాయల మార్కెట్‌ ను ఎమ్మెల్యే వరప్రసాద్‌ పరిశీలించారు. ప్రహరీ నిర్మాణ పనులు నాణ్యతగా చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్‌ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో 50 సంవత్సరాల క్రితం నిర్మించిన కూరగాయల మార్కెట్‌ అధ్వాన స్థితిలో ఉందని ఆ మార్కెట్‌ ను తొలగించి రెండు కోట్ల రూపాయలతో ఆధునిక వసతులతో నూతన మార్కెట్‌ నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ఈ ప్రాంతంలోనే మటన్‌ ఫిష్‌ మార్కెట్‌ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం 90 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, వైసీపీ పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు, మురళి, గోపి, మహేంద్ర పాల్గొన్నారు.