Nov 02,2022 23:26

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి- మధురవాడ : జివిఎంసి ఐదోవార్డులో రూ.59.9లక్షలతో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఐదోవార్డులో రూ.19.90లక్షలతో బోర్‌వెల్స్‌ ఏర్పాటు, న్యూ రాజీవ్‌ గృహకల్ప కాలనీలో రూ.20 లక్షలతో పార్కు అభివృద్ధి, అయ్యప్ప నగర్‌ కాలనీలో కొండపై మెట్లు మార్గానికి రూ.20లక్షలతో అభివద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గడపగడపకూ ప్రభుత్వంలో వచ్చిన వినతుల మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
శంకుస్థాపనలు సరే.. పనులెప్పుడు..?
ఐదోవార్డులో పలు అభివృద్ధి పనులకు ఇప్పటివరకు శంకుస్థాపనలు జరుగుతున్నాయే తప్ప పనులు చేపట్టిన దాఖలాలు లేవని వార్డు కార్పొరేటర్‌ మళ్ల హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్కపనీ ముందుకు సాగడం లేదని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఆమె ఎమ్మెల్యే ముత్తంశెట్టి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా పనులు చేపట్టి పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ పోతిన హనుమంతరావు, పిల్లా కృష్ణమూర్తిపాత్రుడు, పిల్లా సూరిబాబు, పోతిన ప్రసాద్‌, రోసిరెడ్డి, జెఎస్‌ రెడ్డి, మూర్తి బాబు, రజని, సంజీవ్‌ జెడ్‌సి బి.రాము, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.