Oct 06,2023 18:42

ప్రజాశక్తి - చింతలపూడి
   మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మండల ఎంపిపి రాంబాబు తెలిపారు. రేచర్ల పంచాయతీలో ఎంజిఎన్‌ ఆర్‌ జిఎస్‌ గ్రాంట్‌ రూ.5.5 లక్షలతో రేచర్ల తండాలో సీసీ రోడ్డు నిర్మాణంను జెడ్‌పిటిసి నీరజ, సర్పంచి శివరామకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసిపి వార్డ్‌ మెంబెర్‌ అనిత, తుమ్మూరి వెంకట్రామి రెడ్డి, వెంకటేశ్వరావు, తవిర్య, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.