ప్రజాశక్తి -సీలేరు
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో రూ.50 లక్షల విలువైన గంజాయి తోటలను ఒడిశా పోలీసులు శుక్రవారం ధ్వంసం చేశారు. ఒడిశా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మల్కనగిరి జిల్లా కళిమేల బ్లాక్ చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధి కప్ప తొట్టి పంచాయతీ పరిధి అరిగెల, సత్‌పుట్టు గ్రామ అటవీ ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు సమాచారం అందింది. దీంతో మల్కనగిరి ఎస్పి ఆదేశాల మేరకు చిత్రకొండ సిఐ ముకుంద మిల్కా ఆధ్వర్యంలో శుక్రవారం గంజాయి ఆపరేషన్ పరివర్తన కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 30 ఎకరాల్లో గంజాయి తోటలో ధ్వంసం చేశారు. ఇప్పటికైనా గంజాయి సాగు విడనాడకపోతే కఠిన చర్యలు తప్పవని గిరిజనులను హెచ్చరించారు. డ్రోన్ కెమెరాలతో గంజాయి తోటలను గుర్తించి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈనెల 15 వరకు గంజాయి ఆపరేషన్ కొనసాగుతుందని ఒడిశా పోలీసులు వెల్లడించారు.










