బాధితుడినిక నగదు అందజేస్తున్నరామారావు
ప్రజాశక్తి-పాడేరు:రోడ్డు ప్రమాదంలో గాయపడిన పట్టణంలోని ఎలక్ట్రీషియన్ నితీష్ కుమార్‌కు మోద ఉమానీలకంటేశ్వర ఎలక్ట్రీషియన్, ప్లంబర్ యూనియన్ తరపున రూ.5 వేల నగదును అందజేశారు. ఈ యూనియన్‌లో సభ్యుడుగా ఉన్న నితీష్ కుమార్ స్కూటీ పై వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ మేరకు బాధితుడికి యూనియన్ అధ్యక్షుడు రామారావు 5 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సందడి దామోదరం, ఉపాధ్యక్షుడు సరమండ వరప్రసాద్, కార్యదర్శి బంగురు ప్రకాశ్ రావు, కోట సన్యాసిరావు (చిన్న), బబ్లూ, మఠంస్వామి నాయుడు తదితర సభ్యులు పాల్గొన్నారు.










