ప్రజాశక్తి-సీలేరు
ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో సాగులో ఉన్న సుమారు రూ.5 కోట్లు విలువైన గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. ఏవోబీలోని మల్కన్‌గిరి జిల్లా కలిమెల బ్లాక్ పరిధిలో గుర్రలూరు, కమలపొదర్, కుర్మనూర్ గ్రామాల్లో సాగవుతున్న 40 ఎకరాలు గంజాయి తోటలను ఆది, సోమవారాల్లో రెండు రోజులు పాటు ధ్వంసం చేశారు. ఈ మూడు గ్రామాల్లో సుమారు 50 వేలు మొక్కలను ధ్వంసం చేసినట్లు ఒడిశా పోలీసులు తెలిపారు. ఇటీవల పోలీసు చర్యలు వల్ల మావోయిస్టులు ప్రభావం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో తగ్గడంతో గంజాయి సాగు, రవాణాపై దృష్టి సారించామని చెప్పారు. గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం ఉంటే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. అత్యాధునిక పరికరాలు డ్రోన్ కెమెరాలు ఉపయోగించి గంజాయి తోటను గుర్తించి కూకటి వేళ్లతో పకిలిస్తామని ఒరిస్సా పోలీసులు వెల్లడించారు.










