ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో ప్రభుత్వ విప్ ధర్మశ్రీ
ప్రజాశక్తి-చోడవరం
చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు రూ.49.50 లక్షల నిధులు మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ తెలిపారు. ఆదివారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీతో ఆయన సమావేశం నిర్వహించారు. మార్చురీ నిర్మాణానికి రూ.38 లక్షలు, ఆసుపత్రిలో వివిధ వసతులు సమకూర్చడానికి మరో రూ.8 లక్షలు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు ఏర్పాటు కోసం మూడున్నర లక్షల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. చోడవరం మాడుగుల నియోజకవర్గాల్లో పెద్ద ఆసుపత్రి చోడవరంలో ఉందని, దీనిని మరింత అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల రమేష్, ప్రధాన వైద్యులు వినరు, కమిటీ సభ్యులు అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యారావు తదితరులు పాల్గొన్నారు.










