Nov 08,2023 00:35

గోడౌన్లలో తనిఖీ చేస్తున్న అధికారులు

ప్రజాశక్తి-గుంటూరు : వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎ.మద్దులేటి, గుంటూరు అర్భన్‌ వ్యవసాయాధికారి బి.అంజిరెడ్డితో కలిసి ఆటో నగర్‌లోని పురుగు మందుల గోడౌన్లు కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, వివా క్రాప్‌ సైన్స్‌లను తనిఖీ చేశారు. భారత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మోనోక్రోటోఫాస్‌ 36 శాతం పురుగుమందు తయారీని నిషేధించినా ఈ రెండు కంపెనీల గోడౌన్లలో అక్టోబర్‌ 23లో తయారైన మోనోక్రోటోఫాస్‌ ఉన్నందున వాటి నిల్వలను లెక్కించి మొత్తం రూ.40,73,322 విలువ గల 7510 లీటర్ల విక్రయాలను నిలిపేశారు. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌కు చెందిన రూ.38,97,822 విలువ గల 7060 లీటర్లు, వివా క్రాప్‌ సైన్స్‌కు చెందిన రూ.1, 75,500 విలువ గల 450 మోనోక్రోటోఫాస్‌ పురుగు మందును సీజ్‌ చేశారు. ఆయా కంపెనీలను షోకాజు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.