Sep 11,2023 20:35

   జీలుగుమిల్లి : మండలంలోని దర్భగూడెం పంచాయతీలో సోమవారం రూ.40 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఎంపిటిసిలు సున్నం సురేష్‌, కంచర్ల సుధారాణి తెలిపారు. దర్భగూడెంలో 'గడపగడపకు మన ప్రభుత్వ' కార్యక్రమ నిధుల నుంచి రూ.40 లక్షల బడ్జెట్‌ను కేటాయించి గ్రామంలోని పలు రోడ్లను కాంక్రీట్‌ రోడ్‌లుగా మార్చనున్నట్లు తెలిపారు. అదే విధంగా పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఉషారాణి, ఉప సర్పంచి రాఘవరెడ్డి, మాజీ సర్పంచి కోర్స వెంకటేశ్వరావు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.