Oct 20,2023 19:02

ప్రజాశక్తి - చింతలపూడి
   మండలంలో గోద్రేజ్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ సహకారంతో రూ.4 లక్షల విలువైన వాటర్‌ ట్యాంక్‌ని సీతానగరం, చింతంపల్లి పంచాయతీలకు అందజేశారు. ఈ సందర్భంగా చింతంపల్లి సర్పంచి తాండ్ర రామకృష్ణ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలకి తాగునీటి సమస్య లేకుండా చేయటమే లక్ష్యమని తెలిపారు. తాగునీటి సమస్య గ్రామాలలో ప్రజలకు రాకూడదని, గోద్రేజ్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ సహకారంతో మంచినీటి వాటర్‌ ట్యాంక్‌ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో పామాయిల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.