తనిఖీలు చేస్తున్న అధికారులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి: విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు బుధవారం పల్నాడు జిల్లా క్రోసూరు, అచ్చంపేట మండలాల్లోని పలు విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. 3 దుకాణాల్లో అనుమతులు లేకుండా అమ్ముతున్న పత్తి విత్తనాలను గుర్తించి రూ.4.35 లక్షల విలువైన 242 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు డీలర్లపై కేసులు నమోదు చేశారు. సంబంధిత విత్తనాలు విక్రయించరాదని నోటీసులిచ్చారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖాధికారి వాసంతి, సబ్‌ఇన్‌స్పెక్టర్ రామచంద్రయ్య పాల్గొన్నారు.










