Jun 30,2023 00:01

నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ హేని క్రిస్టినా, నియోజకవర్గ సమన్వయకర్త సురేష్‌ కుమార్‌

తాడికొండ: తాడికొండలోని మండల పరిషత్‌ కార్యాలయ ఆవ రణలో రూ.30 లక్షలతో నూతనంగా నిర్మించిన భవ నాన్ని జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌ కత్తెర హేని క్రిస్టినా, నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్‌ కుమార్‌ గురువారం ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు కార్యక్రమంలో నియోజకవర్గ సలహాదారు బత్తుల బ్రహ్మారెడ్డి,ఎంపీపీ తాళ్ల భాగ్యలక్ష్మి శివ నాగరాజు వైస్‌ ఎంపీపీ రెడ్డి త్రివేణి సర్పంచ్‌ తోకల సరోజినీ నరసింహారావు, ఎంపీటీసీ నూతక్కి పర్మిళ,నాయకులు బి వెంకటేశ్వర రెడ్డి ఆళ్ల హనుమంతరావు బండ్ల పున్నారావు పాల్గొన్నారు.