పుల్లంపేట : మండల పరిధిలోని ఎస్‌ఆర్‌పాలెం రాజంపేట-రాయచోటి ప్రధాన రహదారిలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలో రూ.2కోట్లతో పజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మిస్తున్న నగరవనంను ఘనంగా ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలాంటి నగరవనాన్ని నిర్మిస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కతజ్ఞతలు తెపారు. కార్యక్రమంలో రాజంపేట మేడా మల్లికార్జునరెడ్డి, జడ్‌పి చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, పిసిసిఎఫ్ మధుసూదన్‌రెడ్డి, తిరుపతి సిసిఎఫ్ నాగేశ్వరరావు, కర్నూలు సిసిఎఫ్ రామకష్ణ, రాజంపేట డిఎఫ్‌ఒ వివేక్, రాజంపేట డిఎస్‌పి చైతన్య, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.










