
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లలో ఎరువులు, పురుగు మందుల దుకాణంలో విజిలెన్సు అధికారులు గురువారం తనిఖీలు చేశారు. ధనమల్లేశ్వర ఫెర్టిలైజర్సు దుకాణంలో పురుగు మందులు, బయో ఉత్పత్తుల నిల్వలకు అనుమతిలేదని గుర్తించి రూ.5.19 లక్షల విలువైన 265.8 లీటర్ల సరుకులను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవసాయాధికారి కె.రమణకుమార్, ఎస్‌ఐ రామచంద్రయ్య పాల్గొన్నారు.