ప్రజాశక్తి-సంతమాగులూరు: మండలంలోని కొప్పరం గ్రామంలో ఆదివారం జనసేన పార్టీ నాయకుడు కొప్పరపు విజరు కుమార్ కుటుంబానికి ఆదివారం మండలంలోని జనసైనికులు అందరూ కలసి రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కాగా జన సైనికుడు విజరు కుమార్ ఇటీవల పక్షవాతానికి గురికాగా, అతని తండ్రి రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయాడు. దీంతో వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతోంది. ఇది గమనించిన తోటి జనసైనికులు తమ సహాయాన్ని అందజేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి చెల్లా వెంకట కృష్ణారావు మాట్లాడుతూ భవిష్యత్తులో జనసైనికుల కుటుంబాలకు ఎలాం టి ఇబ్బందులు ఉన్నా, జనసేన పార్టీ వారి కుటుంబానికి అండ గా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు సాధు వెంకటేష్, జి రామాంజి, గూడూరి మల్లేశ్వరరావు, వడ్లమాను నాగార్జున, జి వెంకటేష్, అప్పారావు, అడపాల శ్రీను, కే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










