Dec 19,2022 23:33

బాధితురాలికి సెల్‌ ఫోన్‌ అందజేస్తున్న ఎస్‌పి గౌతమి శాలి

ప్రజాశక్తి-అనకాపల్లి : పోగొట్టుకున్న సుమారు రూ.25 లక్షల విలువ చేసే 131 సెల్‌ ఫోన్లను రికవరీ చేసి సోమవారం బాధితులకు ఎస్పీ గౌతమి శాలి చేతుల మీదుగా అందజేశారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో మొబైల్‌ రికవరీ మేళ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫోను పోగొట్టుకున్న బాధితులు జిల్లా పోలీస్‌ వాట్సాప్‌ నెంబర్‌ 9505200100కు హాయి టైప్‌ చేసి aసజూఎశీbఱశ్రీవ్‌తీaషసవతీ.ఱఅ లింకు నొక్కడం ద్వారా పోయిన మొబైల్‌ ఎక్కడ ఉందో ట్రేస్‌ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ విధంగా 131 ఫోన్లను రికవరీ చేసామన్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విజయభాస్కర్‌, ఐటీ కోర్‌ విభాగం ఎస్సై రఘు వర్మ పాల్గొన్నారు.