రూ.24 లక్షలతో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం: మంత్రి
రూ.24 లక్షలతో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం: మంత్రి
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు కట్టకింద రామకృష్ణాపురం గ్రామానికి మున్సిపాలిటీ జనరల్ ఫండ్ 15వ ఆర్థిక నిధుల ద్వారా 24 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక సాంస్కతిక వ్యవహారాల యువజన సర్వీసుల, క్రీడా శాఖ మంత్రి ఆర్‌కె రోజా బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పుత్తూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మండల కన్వీనర్ పార్టీ కన్వీనర్, అధికారులు పాల్గొన్నారు.










