ప్రజాశక్తి - ఉంగుటూరు
చేబ్రోలులో రూ.26 లక్షలతో సిమెంటు రోడ్లు నిర్మాణాలు దాదాపు పూర్తికావచ్చాయని వైసిపి నాయకులు పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు చేబ్రోలులో గతంలో పర్యటించారు. ఆసందర్భంగా గ్రామస్తులు సీసీ రోడ్డు వేయాలని ఆర్జీలు సమర్పించారు. స్పందించిన ఎంఎల్‌ఎ వాసుబాబు రూ.20 లక్షలు జిజిఎంపి నిథులు మంజూరు చేయించారు. ఉంగుటూరు మండల పరిషత్ నిథులు మరో రూ.6 లక్షలు మొత్తం రూ.26 లక్షలతో రోడ్లు నిర్మించారు. ఈనెల 19న ఎంఎల్‌ఎ సీసీ రోడ్లను ప్రారంభిస్తారని కరణం బుజ్జి, ఆకుల రాజా, పాపారావు, బాబ్జిలు వెల్లడించారు. మండల పరిషత్ నిథులతో చేపట్టిన రోడ్డును ఎంపిపి గంటా శ్రీలక్ష్మి, ఎంపిటిసి సభ్యులు రాయిలక్ష్మి, మనసాల నాగమణిలు పరిశీలించారు. గ్రామాల్లో మౌళిక సదుపాయాలకు ప్రభుత్వం కృషి చేస్తొందని ఎంపిపి శ్రీలక్ష్మి తెలిపారు.










