Oct 14,2023 21:15

నేడు ప్రారంభించనున్న ఎంఎల్‌ఎ వాసు బాబు
ప్రజాశక్తి - ఉంగుటూరు
   ఉప్పాకపాడు, బొమ్మిడి, కాగుపాడు, రావులపర్రు గ్రామాల్లో రూ.2 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ఈనెల 15 తేదీన ఎంఎల్‌ఎ వాసుబాబు ప్రారంభిస్తారని వైసిపి మండల కన్వీనర్‌ మంగారావు, ఎంపిపి గంటా శ్రీలక్ష్మి పేర్కొన్నారు. సచివాలయ భవనాలు, రక్షిత తాగునీటి పథకాలు, రైతు భరోసా కేంద్రాలను నిర్మించారు. వాటిని ఎంఎల్‌ఎ ప్రారంభించనున్నారని తెలిపారు.