పార్కు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే, కార్పొరేటర్
ప్రజాశక్తి-గాజువాక: 72వ వార్డు శ్రీనగర్‌లో, గాజువాక జోనల్ కార్యాలయం వెనుక రూ.17.30లక్షలతో నిర్మించనున్న పార్కు పనులకు స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, కార్పొరేటర్ ఎజె.స్టాలిన్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గాజువాక నియోజవకర్గంలోని అన్ని వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ద్వారా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జివిఎంసి ఎఇ నర్సింహమూర్తి, వైసిపి వార్డు ఇన్‌ఛార్జి సిరట్ల వాసు, స్థానిక వార్డు పెద్దలు వెంకటేశ్వరరావు, పుర్రె సత్యనారాయణ, లక్ష్మణరావు, సాలాపు రామారావు, బి.సత్యనారాయణ, అనురాధ, కొసిరెడ్డి లక్ష్మి, ప్రశాంతి పాల్గొన్నారు.










