
ప్రజాశక్తి - పొన్నూరు రూరల్ : మండలంలోని కట్టెంపూడిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేస్తున్న గోడౌన్‌లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. రూ.1.3 కోట్ల విలువైన నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రామచంద్రారెడ్డి తెలిపారు. తయారీదారుడైన రామరంజన్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విజిలెన్స్ ఏవో రమణ కుమార్, మండల వ్యవసాయాధికారి డి.వెంకట్రామయ్య పాల్గొన్నారు.