Nov 08,2023 00:07

రూ.11 కోట్లతో నూతన రోడ్లు

రూ.11 కోట్లతో నూతన రోడ్లు
ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ : అభివృద్ధిలో భాగంగా తిరుపతి రాష్ట్రంలో చర్చనీయంగా ఉందని, ముందుకు వెలుతున్నదని టిటిడి ఛైర్మన్‌, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల నిర్మాణంలో భాగంగా నూతనంగా నిర్మించిన రెండు రహదారులను మంగళవారం భూమన ముఖ్యఅతిథిగా పాల్గొనగా నగరపాలక సంస్థ మేయర్‌ డాక్టర్‌ శిరీష, కమిషనర్‌ హరిత, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, డిప్యూటీ మేయర్లు భూమన అభినరు రెడ్డి, ముద్ర నారాయణ పాల్గొని ప్రారంభించారు. ఈసందర్భంగా భూమన మాట్లాడుతూ అభివద్ధిలో భాగంగా తిరుపతి రాష్ట్రంలో చర్చనీయంగా ఉందని, రహదారుల అభివద్ధితో ప్రజాభివద్ధి జరుగుతున్నదని అందులో భాగంగా నేడు ప్రారంభించిన అనంతాళ్వార్‌ మార్గానికి వారి వంశస్తులైన రంగాచారి, వారి అన్నదమ్ముల అమత హస్తాలతో ప్రారంభించడం తమ అదష్టమన్నారు. మరో మార్గం తిరుమల వెంకటేశ్వర స్వామికి మాన్యాలు, దానాలు ఇచ్చిన పల్లవుల మహారాణి పరాంతక దేవి పేరు మీదగా నామకరణం చేయడం జరిగిందన్నారు. మహిళలు కూడా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే విధంగా రాణి పరాంతకదేవి, సామవాయి, ఆండాల్‌ గోదాదేవి పేర్లను నూతన రహదారులకు పెట్టడం జరిగిందని, అదేవిధంగా స్వామి వారికి సేవ చేసిన మహనీయులైనటువంటి తిరుమల నంబి, జగద్గురు రామానుజాచార్యులు, అనంతాళ్వార్‌, నమ్మాళ్వార్‌, కులశేఖర ఆల్వార్‌ మహనీయుల పేర్లు మీదుగా రహదారులకు నామకరణం చేసుకోవడం ఎంతో అదష్టంగా భావిస్తున్నామని భూమన పేర్కొన్నారు. సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ మోహన్‌, ఎంఈ చంద్రశేఖర్‌, డీఈలు మహేష్‌, సంజీవ్‌ కుమార్‌, వైసిపి నాయకులు పాల్గొన్నారు.