Sep 25,2023 23:31

దుకాణంలో తనిఖీలు చేస్తున్న అధికారులు

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు అర్బన్‌ వ్యవసా యాధికారులు, గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకులు సాధారణ తనిఖీలలో భాగంగా స్థానిక పట్నంబజారులోని వినాయక ఎంటర్‌ప్రైజెస్‌లో సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఐదు కంపెనీలకు చెందిన సుమారు రూ.10 లక్షల విలువైన 289.12 లీటర్లు బయో స్టిమ్యులెంట్స్‌ను గుర్తించి వాటి విక్రయాలు నిలిపేశారు. అధికారులు గుర్తించిన వాటిల్లో జి2, జి3 అనుమతులు లేనివి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సృజన లైఫ్‌ సైన్సెస్‌, రియో అగ్రిసైన్సెస్‌, యూనిక్‌ అగ్రికేర్‌, ఆర్‌ఆర్‌ బయోలాజికల్స్‌, అలాగే గుంటూరు గోరంట్లకు చెందిన సుదర్శన్‌ ఆగ్రీ అండ్‌ బయోకెమికల్స్‌ కంపెనీలు ఉన్నాయి. ఆయా కంపెనీలు బయోస్టిమ్యులెంట్స్‌ తయారీకి కావాల్సిన అనుతిపత్రాలు జి2, జి3 లేకుండా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో ఎడిఎ టి.శ్రీనివాసరావు, వ్యవసా యాధికారులు బి.కిషోర్‌, బి.అంజిరెడ్డి పాల్గొన్నారు.