Apr 12,2023 23:54

చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు:జిల్లాలోని 618 మంది లబ్దిదారులకు ఈబీసీ నేస్తం రెంతడో విడత కింద రూ.92.70 లక్షలను నేరుగా లబ్దిదారుల ఖాతాలకు రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జమ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నుండి సీఎం ప్రారంభించిన ఈబిసి నేస్తం రెండవ విడత ఆర్దిక సహాయ కార్యక్రమాన్ని బుధవారం కలెక్టరేట్‌ నుండి జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, ఐటిడిఏ పిఓ రోణంకి గోపాల క్రిష్ణ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ఆర్దిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొదటి విడత ఎంత మందికి వచ్చిందని లబ్దిదారులను అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డి ఎ పిడి వి.మురళి, బిసి కార్పోరేషన్‌ ఎఇఓ కె.శంకరరావు పాల్గొన్నారు.