Sep 19,2023 22:23

ప్రజాశక్తి-రామచంద్రపురం
రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో రూ.52 కోట్ల అభివృద్ధి పనులు చేశామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు ఆయన మంగళవారం గ్రామంలో రూ.1కోటి 68లక్షల విలువగల భవనాలు ప్రారం భోత్సవం కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల్లో వెల్ల గ్రామానికి వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు రూ.52 కోట్లు వెచ్చించామన్నారు. గ్రామానికి రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్ల ప్రతిపాదనలతో ఆమోదంలో ఉన్నాయని త్వరలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతు ందని అన్నారు. కార్యక్రమంలో రామచంద్రపురం మండల ఎంపిపి అంబటి భవాని, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పండు గోవిందరాజు, జెడ్‌పిటిసి సభ్యుడు మేర్నిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ ఛైర్మన్‌ గాదంశెట్టి శ్రీదేవి, శ్రీధర్‌, సర్పంచ్‌ సూరిబాబు ప్రజాప్రతినిధులు తోపాటు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల వెల్ల గ్రామానికి చెందిన యువకులు హైదరాబాదులో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల చెక్కును ఆయా కుటుంబ సభ్యులకు మంత్రి వేణుచేతుల మీదుగా అందజేశారు.