Sep 19,2023 22:20

అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేస్తున్న కోలగట్ల

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : 16, 48 డివిజన్లలో రూ.40 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంగళవారం డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు.   నగరంలోని 16, 48 డివిజన్ల పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం నిధులతో గుర్తించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ.40 లక్షల వ్యయంతో రహదారులు, కాలువల నిర్మాణం చేపట్టి మారుమూల ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమాల్లో జోనల్‌ ఇన్చార్జి ఆశపు వేణు, కార్పొరేటర్లు గుజ్జల నారాయణరావు, నడిపిల్లి ఆదినారాయణ పాల్గొన్నారు.