Jul 19,2023 22:48

టమోటాలు పంపిణీలో బుద్ధ వెంకన్న, బీసీ మైనార్టీ నాయకులు,

ప్రజాశక్తి - భవానీపురం : పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్‌ నాలుగు స్తంభాలు సెంటర్‌లో గురువారం తెలుగుదేశం పార్టీ టమోటాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టమోటాల రేటు పెరుగుదల నిరసనగా టమాట రేటు తగ్గేంతవరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాలు ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, బీసీ మైనార్టీ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా ఆధ్వర్యంలో రోజుకో ప్రదేశంలో కేజీ రూ.30 లకే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టమోటాల పంపిణీ నాయకులు కాండ్రేగుల రవీంద్ర చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో నేడు టమోటా రూ.150ల ధర అమ్ముతున్నారని, ఈ నేపధ్యంలో తమ పార్టీ ఆధ్వర్యంలో పేద, మధ్య తరగతి ప్రజలకు అతి తక్కువ ధర కేజీ రూ.30లకే టమోటాలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రేగళ్ల లక్ష్మణరావు, పల్లి కిరణ్‌, పేరం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.