Aug 20,2023 23:39

ప్రజాశక్తి-అన్నవరం అన్నవరం దేవస్థానం కొండపైన కొత్తగా విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు వల్ల నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందించవచ్చని ఎపిఇఆర్‌సి చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జున రెడ్డి అన్నారు. కొండపైన ఇటీవల నిర్మించిన 33/11 కెవి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ ఈ కొత్త సబ్‌స్టేషన్‌ వల్ల దేవస్థానం అవసరాలకే కాక అన్నవరంలో కూడా అవసరమైన నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు అవకాశం ఏర్పడిందన్నారు. తొలుతు జస్టిస్‌ నాగార్జున రెడ్డికి దేవస్థానం చైర్మన్‌ ఐవి రోహిత్‌ ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎపిఆర్‌సి సభ్యులు రమా సింగ్‌ వెంకటరామిరెడ్డి, సిఎండి కె.సంతోష్‌ రావు జగ్గంపేట డిఇ రత్నాలరావు, దేవస్థానం విద్యుత్‌ అధికారులు సూర్యనారాయణ చౌదరి పాల్గొన్నారు.