ప్రజాశక్తి-అన్నవరం అన్నవరంసత్యనారాయణ స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు పాలకమండలి సమావేశంలో ఆమోదముద్ర వేశారు. సోమవారం కొండపైన దేవస్థానం చైర్మన్ ఐవి.రోహిత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేవస్థానం ఇఒ ఎస్.ఆజాద్ పాలన, అభివృద్ధి పనులకు సంబంధించి పది అంశాలను ప్రవేశపెట్టారు. వేద పాఠశాల విద్యార్థుల్లో 8 మందిని సంభావన పరిచారకులుగా నియమించడం, వేద విద్యార్థులకు అందించే ఉపకారవేతనం పెంపు, టెండర్ పద్ధతిపై ఆరుగురు వంట పనివారు, పురోహితుల పెన్షన్ అంశాలను ఆమోదించారు. కొత్తగా నిర్వహించే జ్యోతిర్మయి వ్రత విధానం నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని మెజార్టీ సభ్యులు సూచించరాఉ. ఈ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులు ఎంఎల్‌ఎ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, ఎసి రమేష్ బాబు పాల్గొన్నారు.










