
ప్రజశక్తి - చీరాల
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 8న ఆదివారం మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు రోటరీ ప్రతినిధులు గోడపత్రికను శుక్రవారం ఆవిష్కరించారు. స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్, చైతన్య కార్డియాలిక్ సెంటర్ సహకారంతో స్థానిక రోటరీ కమ్యూనిటీ హాల్ నందు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి సమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలపై ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ మావిడాల శ్రీనివాసరావు, సెక్రటరీ చీరాల కృష్ణమూర్తి, ట్రెజరర్ పోలుదాసు రామకృష్ణ, అసిస్టెంట్ గవర్నర్ దోగుపర్తి వెంకట సురేష్, బండారుపల్లి హేమంత్ కుమార్, మువ్వల వెంకటరమణరావు, తులసి, గుర్రం రాఘవరావు పాల్గొన్నారు.