Oct 08,2023 23:53

ప్రజశక్తి - చీరాల
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక రోటరీ సామాజిక భవనంలో ఒంగోలు స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్, చైతన్య కార్డియాక్ సెంటర్ సహాకారంతో ఆదివారం ఉచిత కంటి, గుండె వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంకు డాక్టర్‌ బి నాగ మాధురి, డాక్టర్‌ కృష్ణచైతన్య బృందం పర్యవేక్షణలో 110మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కంటి చత్వారం, (సైట్), కంటి శుక్లం పరీక్ష, నీటి కాసులు పరీక్షలు చేశారు. గుండెకు సంబంధించి బిపి పరీక్ష, ఇసిజి పరీక్ష ఉచితంగా చేశారు. సమస్యల ఉన్న వారు ఒంగోలు హాస్పిటల్‌కి వస్తే అత్యాధునిక పరికరాలతో ట్రీట్మెంట్ యిచ్చి, ఫీజులో 30శాతం రాయితీ యిస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు, జర్నలిస్టులకు హెల్త్ కార్డు ద్వారా ఉచిత కంటి వైద్యం చేస్తామని తెలిపారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సౌకర్యం ఉందన్నారు. కార్యక్రమంలో మామిడాల శ్రీనివాసరావు, పోలుదాసు రామకృష్ణ, జివై ప్రసాద్, డివి సురేష్, ఎంవి రామారావు, వలివేటి మురళీకృష్ణ, డాక్టర్‌ ఐ బాబూరావు, లక్ష్మి ప్రతాప్, చిన్ని లీలాధరారావు, పూర్ణచంద్రరావు, హరినారాయణ, మోహనరావు పాల్గొన్నారు.