Oct 27,2023 00:25

ప్రజశక్తి - చీరాల
రోటరీ సామాజిక సేవల్లో ముందు ఉంటుందని క్లబ్ అధ్యక్షులు మామిడాల శ్రీనివాసరావు అన్నారు. స్థానిక రోటరీ కమ్యూనిటీ హాల్లో క్లబ్ సీనియర్ సభ్యులు, ప్రముఖ న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్ విజయవాడలో ఐఐటి కోచింగ్ తీసుకొంటున్న విద్యార్థిని బోగిరెడ్డి సంయుక్త అనే విద్యార్థినికి ఫీజ్ నిమిత్తం రూ.25వేలు ఆర్ధిక సహాయం అందజేశారు. బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాక్షించారు. విద్యార్థిని గతంలో 10వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం వరకు ప్రసాదనగరం దొబేరా బాలికల వసతి గృహంలో చదివి మంచి మార్కులు సాధించిందని అన్నారు. కార్యక్రమంలో రోటరీ మాజీ ప్రసిడెంట్ డాక్టర్ ఐ బాబురావు, క్లబ్ ప్రతినిధులు పోలుదాసు రామకృష్ణ, జివై ప్రసాద్, డివి సురేష్, ఎంవి రామారావు, డేగల తిరుపతిరావు, నక్కల సురేష్, శివాంజనేయప్రసాద్, మోహనరావు, శంకరరెడ్డి పాల్గొన్నారు.