
ప్రజాశక్తి - పాలకొల్లు
రోటరీ యూత్ సర్వీస్ నెలలో భాగంగా శుక్రవారం పాలకొల్లు రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో ఎంఎంకెఎన్‌ఎం హైస్కూల్లో పర్యావరణ పరిరక్షణలో మన పాత్ర అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పాలకొల్లులోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల నుంచి వచ్చిన 140 మంది విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన జూనియర్స్, సీనియర్స్ విభాగం నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామని పాలకొల్లు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పెనుమాక రామ్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ రావాడ సతీష్, ట్రెజరర్ ముత్యాల ప్రదీప్, అసిస్టెంట్ గవర్నర్ యిమ్మిడి రాజేష్, మాజీ ప్రెసిడెంట్లు చందక రాము, కటారి నాగేంద్ర, రోటరీ సభ్యులు కానూరి ప్రభాకర్, ఎన్‌ఎన్.మూర్తి, పోతాబత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు.