Sep 07,2023 22:36

ప్రజాశక్తి - పాలకొల్లు రూరల్‌
             స్థానిక గురుకుల విద్యాలయంలో పాలకొల్లు రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు బుధవారం స్కిప్పింగ్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగం నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామని పాలకొల్లు రోటరీ క్లబ్‌ ప్రెసిడెంట్‌ పెనుమాక రామ్మోహన్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ సెక్రటరీ రావాడ సతీష్‌, రోటరీ అసిస్టెంట్‌ గవర్నర్‌ యిమ్మిడి రాజేష్‌, మాజీ ప్రెసిడెంట్లు మద్దాల వాసు, చందక రాము, కటారి నాగేంద్ర, రోటరీ సభ్యులు, కానూరి ప్రభాకర్‌, పోతాబత్తుల సత్యనారాయణ, గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్‌ మహాపత్ర పాల్గొన్నారు.