
ప్రజాశక్తి - పాలకొల్లు
పాలకొల్లు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో యూత్ సర్వీస్ మంత్‌లో భాగంగా గురువారం సీనియర్స్, జూనియర్స్ విభాగంలో డ్యాన్స్ పోటీలు లయన్స్ క్లబ్‌లో నిర్వహించారు. గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తామని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పెనుమాక రామ్మోహన్ తెలిపారు. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ యిమ్మిడి రాజేష్, క్లబ్ సెక్రటరి రావాడ సతీష్, మాజీ ప్రెసిడెంట్ చందక రాము, కటారి నాగేంద్రకుమార్, పివి.సుబ్బరాజు, ముత్యాల శ్రీనివాస్, వి.గంగాధర్, కానూరు ప్రభాకర్, పాతాబతుల సత్యనారాయణ, తెన్నేటి శ్యాంబాబు పాల్గొన్నారు.