ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు రోటరీక్లబ్ ఆధ్వర్యంలో యువజన వారోత్సవాల్లో భాగంగా 4 మండలాల ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహించారు. ప్రథమ బహుమతిని బి యోగీశ్వరి బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నాగులపాలెం, ద్వితీయ బహుమతి ఎస్ కృపావర్షిణి, ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూలు పర్చూరు, తృతీయ బహుమతి ఎన్ సాయి సుజిత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, స్వర్ణ, కన్సోలేషన్ బహుమతి బి సిరి (నాగులపాలెం), షేక్ మోతి (పర్చూరు) అందించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నాగభైరు శ్రీనివాసరావు, కెఎస్‌ఆర్‌కె ప్రసాదు, దండా శ్రీనివాసరావు, పాబోలు ఉదయ భాస్కర్, పంబి సదానందరెడ్డి, భవనం రాజగోపాల్‌రెడ్డి, గడ్డిపాటి శ్రీనివాసరావు, కోట హరిప్రసాద్, పి గిరిజాకుమారి, కోమటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా పివిఎస్ ప్రసాదు, చల్లా కుమార్‌లు వ్యవహరించారు. అనంతరం విజేతలకు, న్యాయనిర్ణేతలకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.










