Sep 17,2023 01:11

ప్రజాశక్తి - పంగులూరు
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పెదకాకాని శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో 126మందికి గ్రామంలో శనివారం కళ్ళజోళ్ళు పంపిణీ చేసినట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు కరణం హనుమంతరావు తెలిపారు. ఈనెల 13న రోటరీ క్లబ్ పర్యవేక్షణలో శంకర్ కంటి వైద్యుల ద్వారా కంటి పరీక్షలు చేశారు. వారిలో శుక్లముల ఆపరేషన్ చేయించుకున్న వారికి ఉచితంగా కళ్ళజోళ్ళ పంపిణీ చేశారు. శుక్లముల ఆపరేషన్లు చేయించుకున్న వారిని డాక్టర్ దీక్ష గుప్తా పరిశీలించి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో క్యాంపు కన్వీనర్ చిలుకూరి వీరరాఘవయ్య, సభ్యులు తాటి చిన సుబ్బారావు, పెంట్యాల జగదీశ్వరరావు, జాగర్లమూడి సుబ్బారావు (జెకేసి), పోతిని ప్రసాద్, రాయిని వెంకట సుబ్బారావు, గుడిపూడి రామారావు లు పాల్గొన్నారు.