Oct 03,2023 00:38

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌
రోటరీ క్లబ్ ఆఫ్ ఇంకొల్లు సెంట్రల్ ఆధ్వర్యంలో గుంటూరు శంకర్ నేత్ర వైద్యశాల మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో ఇంకొల్లు యన్. ఆర్.& వి.యస్.ఆర్. బాలికోన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. 350 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 150మందికి శుక్లాల ఆపరేషన్ అవసరమని వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్లు అవసరమైన వారికి ఈనెల 8వ తేదీన గుంటూరు శంకర్ నేత్రాలయంలో ఉచితంగా ఆపరేషన్ లు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇంకొల్లు గర్ల్స్ హై స్కూల్ నుండి మూడు బస్సులు వచ్చి ఆదివారం అందరినీ తీసుకొని పోయి ఆపరేషన్లు పూర్తిచేసి మంగళవారం మళ్లీ బస్సుల్లో తీసుకువచ్చి గరల్ హైస్కూల్ వద్ద దించుతామన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అసిస్టెంట్ గవర్నర్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేయగా,  డాక్టర్ ఆలా శ్రీకృష్ణమూర్తి, డాక్టర్ కమల, డాక్టర్ దీక్షితగుప్తలు శిబిరం లోని వేరు, వేరు విభాగాలను ప్రారంభించారు. కార్యక్రమములో ఆర్గనైజర్ రవికాంత్, క్లబ్ అధ్యక్షులు కరి. కమలేశ్వరరావు, కార్యదర్శి జెట్టి వెంకటేశ్వర్లు (స్వామి), కోశాధికారి చుండి సాంబశివరావు, అసిస్టెంట్ గవర్నర్ ఇంటూరి ఆంజనేయులు, సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ పోపూరి రామమోహనరావు, హెల్త్ క్యాంపుల డైరెక్టర్ డాక్టర్ ఆలా శ్రీకృష్ణమూర్తి, సభ్యులు పేర్ని సత్యనారాయణ, వీరగంధం ఆంజనేయులు, వత్సవాయి రాఘవరాజు, ఐ.యం.వి. ప్రసాద్, హన్ను, భవనం అంజిరెడ్డి, వంకాయలపాటి శ్రీమన్నారాయణ, కొల్లూరి నాయుడమ్మ, కందిమళ్ల రామకోటేశ్వరరావు, పాఠశాల సిబ్బంది, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.