ప్రజాశక్తి-విజయవాడ అర్బన్
విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ రోలర్ స్కేటింగ్‌లో జోయల్ రోలర్ స్కేటింగ్ క్లబ్ క్రీడాకారులు పతకాలు సాధించారని క్లబ్ సభ్యులు మహంతి వాసు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20, 21 తేదీలలో జరిగిన పోటీలలో అండర్-19 విభాగంలో వై.మాధురి రెండు బంగారు పతకాలు సాధించినట్లు తెలిపారు. అండర్-17 విభాగంలో కె.పూజ రెండు రజత పతకాలు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను క్లబ్ సభ్యులు ఆర్.ఎస్.ఎన్.ప్రసాద్ కంతేటి నవీన్, పతివాడ ప్రసాద్ అభినందించారు.










