ప్రజాశక్తి - హోళగుంద
రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మండలంలో ప్రతి సచివాలయంలో స్పందన నిర్వహించాలని, వచ్చిన సమస్యలకు పరిష్కారం వెంటనే చూపాలని జిల్లా యానిమల్ హజ్బెండరి జెడి, మండల ప్రత్యేకాధికారి రామచంద్రయ్య అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మండలాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి శాఖలోనూ సమస్యలు ఉన్నాయని, వాటిని గుర్తించి పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని కోరారు. అనంతరం ఆయన జగనన్న కాలనీలో గృహ నిర్మాణ శాఖ సహకారంతో నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు చురుకుగా జరిగేందుకు కింది స్థాయి అధికారులను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని హౌసింగ్ డిఇ ఆదినారాయణకు సూచించారు. తహశీల్దార్ హుస్సేన్ సాబ్, ఎఒ నరేంద్ర కుమార్, ఎంఇఒ ఈరన్న, ఇఒఆర్‌డి చంద్రమౌళీశ్వర గౌడ్, మేజర్ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ పాల్గొన్నారు.
అధికారులతో మాట్లాడుతున్న రామచంద్రయ్య










