ప్రజాశక్తి - ఆదోని
ఆదోని పట్టణ వాసులకు తాగునీటి ఎద్దడి రాకుండా రోజు మార్చి రోజు నీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి తెలిపారు. శనివారం ఎల్‌ఎల్‌సి నుంచి బసాపురం ఎస్‌ఎస్ ట్యాంకుకు నీటి పంపింగ్ కోసం జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కాలువ నుంచి సరఫరా అయ్యే నీరు నేరుగా తాగకుండా వేడి చేసి వాడుకోవాలని తెలిపారు. నీటి సరఫరాకు ముందు క్లోరినేషన్ చేసినప్పటికీ ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుందని, జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగభూషణం రెడ్డి మాట్లాడుతూ... కాలువలో నీటి ప్రవాహం జోరుగా ఉందని, 40 రోజుల పాటు పంప్ చేస్తే ట్యాంకు నిండుతుందని తెలిపారు. ట్యాంకులో ఇప్పటికి 25 రోజులకు సరిపడా నీరు నిల్వ ఉందన్నారు. తాగునీటి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్సీ మధుసూదన్, మున్సిపల్ ఛైర్మన్ శాంత, మార్కెట్ యార్డు ఛైర్మన్ మజార్, వైస్ ఛైర్మన్ కామాక్షి తిమ్మప్ప, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజినీర్ రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ సందీప్ రెడ్డి, సురేష్, మాజీ కౌన్సిలర్ చంద్రకాంత్ రెడ్డి, సింహం నాగేంద్ర, నాయకులు నాగరాజు, సన్నీ, చిన్న ఈరన్న, నారాయణ ఉన్నారు.
ఎస్‌ఎస్ ట్యాంకులోకి నీటి పంపింగ్ కోసం జల హారతి ఇస్తున్న ఎమ్మెల్యే










