
ప్రజాశక్తి - పర్చూరు
మంత్రి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై వైసీపీ మహిళలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆడవారి చేతిలో అవమానం తప్పదని హెచ్చరించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుండి బొమ్మల సెంటర్ వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను అందరూ ఖండించారు. మీ ఇళ్లలో ఆడవాళ్లు ఉన్నారనేది గుర్తుపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఆడవారిని అవమానించి తప్పుచేశారని అన్నారు. మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇంటికి వచ్చి బుద్ధి చెప్పాల్సి వస్తుందని అన్నారు. అనంతరం బండారు సత్యనారాయణ మూర్తి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పర్చూరు సర్పంచ్ మల్లా అంజమ్మ, వైసీపీ మహిళా నాయకురాలు తులసి నాగమణి, ఎం సత్యవతి, నాయకులు అడపా సుధాకరరెడ్డి, మల్లా శ్రీనివాసరావు, ఒగ్గుశెట్టి ప్రసాద్, రామకృష్ణ, ఆకుల హేమంత్, జంగా అనిల్ పాల్గొన్నారు.