పల్నాడు జిల్లా: వైద్య సేవలు కోసం ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చే రోగుల పట్ల వైద్య బృందం మర్యాదపూర్వకంగా మెల గాలని మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. పట్టణంలోని పల్నాడు రోడ్డులో గల పాత ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రికా ర్డులను పరిశీలించారు. వైద్య సేవలు అందుతున్న తీరును గర్భిణులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం పాత ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవాలు గర్భిణులకు వైద్య సేవలు సమర్థవంతంగా అందుతున్నాయన్నారు. మాతాశిశు మరణాల నివారణకు వైద్య సిబ్బంది తమ వంతు కృషి చేయాలని సూచించారు. పరిసరాలను ఎప్పటిక్కప్పుడు శుభ్రంగా ఉండాలని ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పాలని సూచించారు. హాస్పిటల్ కు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పలు అంశాలను ఏరియా హాస్పిటల్ డిసిహెచ్‌ఎస్ రంగారావు, డాక్టర్ ఓరుగంటి శేషిరెడ్డి, కామి రెడ్డి శ్రీనివాస రెడ్డి, నోడల్ అధికారి హనుమా నాయక్, పలు విభాగాల వైద్యులు వైసిపి నాయకులు పాల్గొన్నారు.










