Oct 05,2023 23:08

రావెలలోని ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి

తాడికొండ: ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా తాడికొండ మండలం రావెలలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబి రాన్ని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి పరిశీలించారు .వైద్య శిబిరంలో రోగులకు నిర్వహిస్తున్న బిపి, షుగర్‌ పరీ క్షల స్టాల్‌ ను పరిశీలించారు. వైద్య శిబిరంలో స్త్రీలకు ,పురుషులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఐసిడిఎస్‌ ఏర్పాటు చేసిన స్టాల్‌ ను పరిశీలించారు. ఈ వైద్య శిబిరంలో చికిత్స అందిస్తున్న డాక్టర్లు, ప్రత్యేక వైద్య నిపుణుల వివరాలను, రోగుల కంటి సమస్యల గురించి కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన కంటి పరీక్షలు చేసి వారికి చికిత్స, మం దులు అందించాలన్నారు. అలాగే, కళ్ళజోళ్ళు అవసరమైన వారిని గుర్తించి వాటిని అందించాలని తెలిపారు. వైద్య శిబిరానికి వచ్చిన రోగులందరికి పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలు అందించే వరకు వైద్య సిబ్బందితో పాటు ఇతర వైద్య సహా యకులు అందరూ శిబిరంలో తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఇంటింటికి సర్వే నిర్వహించేటప్పుడు అందు బాటులో లేనివారు నేరుగా వైద్య శిబిరానికి వస్తే వారి పేరుని కూడా కొత్తగా నమోదు చేసుకొని, అవసరమైన వైద్య చికిత్సతో పాటు మందులు ఉచితంగా అందించాలని సూచించారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, డ్రాప్‌ ఔట్లపై ఆరా తీశారు. మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నత పాఠశాలలో 481 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు తెలుపుతూ వారిలో 350 మంది విద్యార్థులు 72 శాతం మాత్రమే మధ్యాహ్న భోజ నాన్ని స్వీకరిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగమణి కలెక్టర్‌ కు వివరించారు. జిల్లాలో సరాసరి 90 శాతం మంది విద్యా ర్ధులు మధ్యాహ్న భోజనాన్ని తీసు కుంటున్నారని, ఈ ఉన్నత పార Äశాలలో 70 శాతం మంది విద్యార్ధులు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నా రని కలెక్టర్‌ ప్రశ్నించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు బలవర్ధకమైన ఫర్టిఫైడ్‌ రైస్‌ తో భోజనం అందిస్తున్న విషయాన్ని విద్యార్థుల తల్లి తండ్రులకు వివరించాలని కలెక్టర్‌ చెప్పారు. దసరా పం డుగ సెలవుల అనంతరం వంద శాతం మధ్యాహ్న భోజ నాన్ని విద్యార్ధులు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయు రాలును ఆదేశించారు. కార్యక్రమంలో డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ శ్రావణ బాబు, మండల ప్రత్యేక అధికారి సుధాకర్‌, తహశీల్దార్‌ ఫణీంద్రబాబు, ఎంపిడిఒ దీప్తి, విఆర్‌ఒ బ్రహ్మయ్య, సర్పంచ్‌ శైలజ పాల్గొన్నారు.