సిబ్బందితో మాట్లాడుతున్న నర్సింగరావు
ప్రజాశక్తి -నక్కపల్లి:స్థానిక 50 పడుకుల ఆసుపత్రిని శుక్రవారం కాయకల్ప టీం తనిఖీ చేసింది. విజయవాడ నుండి వచ్చిన బృందంలోని డాక్టర్ జేడీ నర్సింగరావు నేతృత్వంలో ఆస్పత్రిలో తనిఖీలు చేపపట్టారు. రిజిస్టర్లు, స్టోర్‌లో వున్న మందులను పరిశీలించారు. ఆస్పత్రి జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో వున్న పరికరాలను పరిశీలించారు.అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ జనార్దన్, డాక్టర్ జయలక్ష్మి, పలువురు వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా ముందుగానే ఇండెంట్ పెట్టుకుని అవసరమైన మందులను తెప్పించుకోవాలని సూచించారు.










